Entertainment
వరదలో డాన్స్,
ముంబైలో కురిసిన భారీ వర్షాల కారణంగా నగరం మొత్తం నీట మునిగిపోయింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు చెరువుల్లా మారి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, కొందరు మాత్రం ఈ వరదను సరదాగా మార్చేశారు.
తాజాగా ఓ వ్యక్తి వరద నీటిలో డాన్స్ చేస్తూ, తెప్ప సాయంతో ప్రవాహంలోకి దూకి ఈత కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు, మరికొందరు వరదలోనే చేపలు పడుతూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.