Andhra Pradesh

లిక్కర్ స్కామ్ కేసు.. రంగంలోకి దిగిన ED

Liquor Scam: మద్యం స్కామ్‌పై ఈడీ కేసు | ED Launches Probe into AP Liquor  Scam Tracing Hawala Shell Company Network

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ. 3,200 కోట్ల మేరకు జరిగిన ఈ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా దర్యాప్తు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ కేసును విచారిస్తున్న ఈడీ, ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు జారీ చేసి, ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీకి చెందిన పలువురు నేతలు అరెస్టయిన విషయం తెలిసిందే.

2019-2024 మధ్య వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ స్కామ్‌లో కిక్‌బ్యాక్‌లు, బ్రాండ్ మానిపులేషన్, మాన్యువల్ ఆర్డర్ ప్రక్రియల ద్వారా దోపిడీ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎంపీ పీవీ మిధున్ రెడ్డితో సహా పలువురు వైఎస్ఆర్‌సీపీ నేతలను సిట్ అరెస్టు చేసింది. ఈడీ దర్యాప్తు హవాలా నెట్‌వర్క్‌లు, షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై దృష్టి సారించింది. నెలవారీ రూ. 50-60 కోట్ల కిక్‌బ్యాక్‌లు సేకరించి, ఎంపిక చేసిన లిక్కర్ బ్రాండ్‌లను ప్రమోట్ చేసిన సిండికేట్‌పై విచారణ కొనసాగుతోంది. వైఎస్ఆర్‌సీపీ నేతలు ఈ అరెస్టులను టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపుగా వర్ణిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version