Andhra Pradesh
లిక్కర్ కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు: జూలై 1 వరకు కొనసాగింపు
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్‌ను ఏసీబీ కోర్టు జూలై 1వ తేదీ వరకు పొడిగించింది. ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియడంతో నిందితులను కోర్టులో హాజరుపరిచారు.
ఈ కేసులో కసిరెడ్డి, చాణక్య, దిలీప్, శ్రీధర్, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప లను నిందితులుగా పోలీసులు గుర్తించారు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో మరిన్ని ఆధారాలు సేకరించే దశలో ఉన్న ఏసీబీ అధికారులు, నిందితుల కస్టడీపై కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు