Entertainment
రోహిత్, కోహ్లి.. ప్రాక్టీస్ మొదలెట్టారు!
భారత క్రికెట్ జట్టుకు మళ్లీ ఉత్సాహం నింపే వార్త బయటకు వచ్చింది. టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మళ్లీ యాక్షన్‌లోకి అడుగుపెట్టారు. రాబోయే అంతర్జాతీయ సిరీస్, ముఖ్యంగా వరల్డ్ కప్ దృష్ట్యా వీరిద్దరూ సీరియస్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారని సమాచారం. రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టుతూ మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక మరోవైపు విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌లో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటున్నాడు. అక్కడ ఓ అభిమాని తో తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కోహ్లీతో ఫొటో దిగిన ఫ్యాన్ దానిని షేర్ చేయగానే క్షణాల్లోనే అది ట్రెండింగ్ అయింది. ఎప్పటిలాగే కోహ్లీ తన కఠినమైన ప్రాక్టీస్ రొటీన్ కొనసాగిస్తున్నాడని తెలుస్తోంది.
ఈ ఇద్దరు సీనియర్ క్రికెటర్లు మళ్లీ మైదానంలో అడుగుపెడుతున్నారని తెలిసి అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. “వరల్డ్ కప్ వేట మొదలైంది” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాబోయే అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో స్టార్ట్ కానున్న వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీలు ఆడే అవకాశముందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సిరీస్‌కు ముందు నుంచే ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.