Latest Updates

రేవంత్ బీజేపీ సీఎం అని ముస్లింలు గుర్తించాలి: KTR

Ktr sensational comments on cm revanth reddy and central bjp govt over hcu  land fraud issue pa | KTR Tweet: దొంగతనాలు బైటపడటంతో అటెన్షన్.. డైవర్షన్‌లు  ఎక్కువయ్యాయి.. రేవంత్ పై నిప్పులు ...

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ 60 ఏళ్లుగా మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్‌పై తాను చేసిన విమర్శల్లో మైనార్టీ హక్కులు, బడ్జెట్, హామీల అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.

రేవంత్‌పై కేటీఆర్ దూకుడు
ముస్లింలు కాంగ్రెస్ అసలు రూపాన్ని గుర్తించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ ఆధీనంలోనే పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. “మోదీని పెద్దన్నలా భావించి ఆయన చెప్పినట్లే నడుస్తున్న రేవంత్ సీఎం” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే వాస్తవానికి అది మోదీకి, బీజేపీకి వేసిన ఓటే అవుతుందని ఆయన హెచ్చరించారు.

హామీల అమలు ప్రశ్నార్థకమే
మైనార్టీల కోసం నాలుగు వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించి చివరికి వాస్తవానికి ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించారు. అంతేకాక ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని చెప్పి మోసం చేసిందని గుర్తు చేశారు. తెలంగాణలో మైనార్టీల సంక్షేమం కేవలం బీఆర్‌ఎస్ హయాంలోనే సాధ్యమవుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version