News
రేబీస్ భయంతో పాపను చంపి తల్లి ఆత్మహత్య
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అమానుష ఘటన వెలుగుచూసింది. రేబీస్ సోకిందనే అనుమానంతో యశోద (36) అనే మహిళ తన మూడేళ్ల కూతురిని చంపి, అనంతరం తానే ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషాద ఘటనపై యశోద భర్త సంచలన వివరాలు వెల్లడించారు. కుక్కలు ఎంగిలి చేసిన పల్లీలు తినడంతో పాపకు రేబీస్ సోకిందని యశోద అనుమానించిందని తెలిపారు. వైద్యులు టీకాలు వేసినా, ఆమె అనుమానాలు తగ్గలేదని చెప్పారు.
మానసిక స్థితి కోల్పోయిన యశోద, ఆవేదనలో పాపను హత్య చేసి తాను ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు భర్త వివరించారు.