Latest Updates
రేప్ కేసులో జీవిత ఖైదు.. చీరే పట్టించింది
బెంగళూరు: మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఇటీవల బెంగళూరులో సంచలనంగా మారిన రేప్ కేసులో జీవిత ఖైదు శిక్ష పడింది. 47 ఏళ్ల పనిమనిషిపై అత్యాచారం చేసిన కేసులో న్యాయస్థానం కఠినంగా స్పందించింది. విచారణలో ఆరోపణలు ధృవీకరమైన నేపధ్యంలో, ప్రజ్వల్‌కు లైఫ్ సెంటెన్స్ విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.
ఈ కేసులో అతని శిక్షకు కారణమైన కీలక ఆధారం బాధితురాలి చీరగానే మారడం విశేషం. రేప్ అనంతరం ఆ చీరను తన ఫామ్‌హౌస్‌లోని అటకపై పడేశాడని తెలుస్తోంది. విచారణలో పాల్గొన్న పోలీసు అధికారులు అక్కడి నుంచి ఆ చీరను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. DNA పరీక్షల్లో ఆ చీరపై ఉన్న స్పెర్మ్ సెల్స్ ప్రజ్వల్‌వే అని స్పష్టమైంది.
అత్యాచారానికి శారీరక ఆధారాలు అనివార్యమని పలుమార్లు న్యాయ నిపుణులు చెబుతుంటారు. ఈ కేసులో కూడా చీరపై గుర్తించిన జీన్స్ ఆధారంగా నిజం బయటపడింది. ఇదే తీర్పులో మలుపు తెచ్చినట్టు విచారణాధికారులు పేర్కొన్నారు. ప్రజ్వల్‌కి విధించిన జీవిత ఖైదుతో పాటు, అతనిపై మిగతా సెక్షన్ల కింద కూడా మరిన్ని శిక్షలు విధించే అవకాశం ఉందని సమాచారం.