Latest Updates
రేపు లాసెట్, పీజీ లాసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణలో లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన లాసెట్ మరియు పీజీ లాసెట్ పరీక్షల ఫలితాలు రేపు (జూన్ 25) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి అధికారికంగా ఫలితాలను ప్రకటించనున్నారు.
గత నెల 6న నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీని జూన్ 11న విడుదల చేయగా, 13వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించారు. రేపు ఫైనల్ ఆన్సర్ కీతో పాటు ఫలితాలు కూడా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాల అనంతరం ప్రవేశ ప్రక్రియపై మరిన్ని వివరాలు వెలువడే అవకాశముంది