Latest Updates
రేపటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటనలు ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి పలు జిల్లాల్లో పర్యటన చేపట్టనున్నారు.
రేపు మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్రలో ఒక ఫార్మా కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడులో జరగనున్న ఇందిరమ్మ గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఎల్లుండి సీఎం కామారెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించనున్నారు. లోకల్ బాడీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపు, సాధ్యమైనంత ఎక్కువ జిల్లాలను సీఎం పర్యటించనున్నారని సమాచారం.