Andhra Pradesh

రూ.105 కోట్లకు ‘పెద్ది’ డిజిటల్ హక్కులు? Netflix చేతికి స్ట్రీమింగ్ రైట్స్!

Buy Premium NETFLIX by Expodhick Academy on Selar

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ ఇప్పటికే టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఏర్పరచుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులపై సంచలన వార్తలు వెలుగులోకి వచ్చాయి.

అధికారిక ప్రకటన లేకపోయినా, టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు, ప్రముఖ ఓటీటీ దిగ్గజం Netflix, ‘పెద్ది’ డిజిటల్ హక్కులు ఏకంగా రూ.105 కోట్లకు సొంతం చేసుకుందని టాక్. ఇది తెలుగు సినిమాల డిజిటల్ మార్కెట్‌లోని అత్యంత భారీ ఒప్పందాల్లో ఒకటిగా చెబుతున్నారు. పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం రామ్ చరణ్ ప్రత్యేకమైన లుక్‌ను తయారు చేసుకున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ‘పెద్ది’పై ప్రేక్షకుల్లోనే కాకుండా, డిజిటల్ మార్కెట్లోనూ భారీ హైప్ నెలకొనడం విశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version