Andhra Pradesh
రూ.లక్ష దాటే దిశగా 22 క్యారెట్ల బంగారం ధర
బంగారం ధరలు పతంగిలా ఎగుస్తూ ఆకాశమే హద్దు అన్నట్టుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.870 పెరిగి రూ.1,08,490కి చేరింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.800 పెరిగి రూ.99,450గా నమోదైంది. దీంతో మరో రెండ్రోజుల్లో చరిత్రలో తొలిసారిగా 22 క్యారెట్ల గోల్డ్ రూ.లక్ష మార్క్‌ను అధిగమించే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
ఇక వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.1,38,000 వద్ద నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.