Connect with us

News

రాజ్యసభ ఎన్నికలకు తెలంగాణలో 2 స్థానాలకు షెడ్యూల్ విడుదల!

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ #రాజ్యసభఎన్నికలు #ఎన్నికలషెడ్యూల్ #తెలంగాణరాజకీయాలు #ఎన్నికలసంఘం #తెలంగాణకాంగ్రెస్ #భారతప్రభుత్వం #రాజ్యసభస్థానాలు #ఎన్నికలనోటిఫికేషన్ #రాజకీయవార్తలు #తెలంగాణన్యూస్ #ఎంపీఎన్నికలు

దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి భారత ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. 10 రాష్ట్రాల పరిధిలోని మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని రెండు స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.

నోటిఫికేషన్ విడుదల ఫిబ్రవరి 26,నామినేషన్ల గడువు మార్చి 5,మార్చి 6 న నామినేషన్ల పరిశీలన,మార్చి 9 ఉపసంహరణకు ఆఖరి తేదీ,పోలింగ్ & లెక్కింపు మార్చి 16 (ఉదయం 9 నుండి సాయంత్రం 4 వరకు పోలింగ్, 5 గంటల నుండి లెక్కింపు),మార్చి 20 నాటికిప్రక్రియ పూర్తికానుంది.

తెలంగాణ నుండి రాజ్యసభ సభ్యులుగా ఉన్న కేఆర్ సురేష్ రెడ్డి (BRS), అభిషేక్ మను సింఘ్వీ (Congress) ల పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలబలాల ప్రకారం, ఈ రెండు స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మొత్తం 37 స్థానాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇతర రాష్ట్రాల వివరాలు:తమిళనాడు, పశ్చిమ బెంగాల్ , బిహార్,ఒడిశా, అస్సాం,తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేంద్రంలోని ఎన్డీయే కూటమికి రాజ్యసభలో బలాన్ని పెంచుకోవడానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకం కానున్నాయి.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *