Andhra Pradesh
రాజకీయాల నుంచి సినిమాల దిశగా అడుగులు… జమిందార్ రోల్‌లో మంత్రిగారి ఎంట్రీ!
రాజకీయాలు, ప్రజాసేవలతో నిమగ్నమై ఉండే నేతలు కూడా ఇప్పుడు కొత్త ప్రయోగాల కోసం సినీ రంగాన్ని ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో చేరిన వారు ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. మొదటిసారిగా ఆయన ఒక చిత్రంలో నటిస్తూ రీల్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఎవరది సినిమాలో జమీందార్‌గా పోషిస్తున్న ఆయన ప్రాతినిధ్యం ఇప్పటికే షూటింగ్ సెట్‌లో సందడి చేస్తోంది.
చిత్రం నేపథ్యము గ్రామీణ మూఢనమ్మకాలు మహిళలపై జరిగే అన్యాయం వంటి సామాజిక సమస్యలుపై తేలికగా సినిమా తీయడం జరిగింది. మంత్రి సుభాష్ దీనిలో నటించడంతో దీనికి మరింత ప్రాధాన్యత వచ్చింది. షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.
బిజీ రాజకీయ షెడ్యూల్ మధ్యలో కూడా సమయం కేటాయించి చిత్రీకరణలో పాల్గొనడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఏలూరు జిల్లా పెదపాడులో జరిగిన షూటింగ్‌ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆ ప్రాంతం పండుగ వాతావరణాన్ని దక్కించుకుంది.
ఈ చిత్రం మెగా మూవీ బ్యానర్‌పై రూపుదిద్దుకోగా, నిర్మాతగా వట్టి శ్యామ్, దర్శకత్వ బాధ్యతలను జుత్తిగ వెంకట్ నిర్వహిస్తున్నారు. కథ అంతా గ్రామీణ వాతావరణం, సూపర్‌స్టిషన్స్, ఆడపిల్లలపై దాడులపై నిర్మితమవుతోంది. మంత్రిగారి పాత్ర ఉండడంతో సినిమా చుట్టూ మొదటి నుంచే హైప్ నెలకొంది.
షూటింగ్ కోసం పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లిన సందర్భంగా, ఆయన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను మర్యాదగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి పనులు ముఖ్యంగా పి 4 కార్యక్రమం కింద హైస్కూల్ అభివృద్ధి, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు వంటి అంశాలు ఎమ్మెల్యే సందర్భంగా వివరించారు.
పెడపాడు పర్యటనలో మంత్రి సుభాష్‌కు జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ప్రసాద్ అందంగా సన్మానం చేశారు. అలాగే సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామచంద్రాపురం నియోజకవర్గ యువతకు FLADARRA సంస్థ ద్వారా ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఇది స్థానిక యువతకు మంచి ప్రోత్సాహంగా నిలుస్తోంది.
#VasamsettiSubhash#APMinister#EvaradiMovie#TollywoodNews#APPolitics#MinisterInMovies#SocialIssuesCinema#EluruUpdates
#WestGodavari#APLatestNews#FLADARRA#YouthOpportunities#MegaMovieBanner#TeluguCinema
![]()
Continue Reading
