Entertainment
రష్మిక మందన్న అభిమానులకు గోల్డెన్ ఛాన్స్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన తాజా సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన ఛాలెంజ్‌ను అభిమానులకు ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా కొత్త సినిమా పోస్టర్‌ను షేర్ చేసిన ఆమె, “ఈ టైటిల్‌ను ఎవరైనా గెస్ చేయగలరా?” అంటూ సందేశం పెట్టారు. అభిమానుల ఊహలకు అవకాశమిచ్చిన రష్మిక, “ఈ టైటిల్‌ను ఎవరూ ఊహించలేరు, కానీ ఎవరికైనా కరెక్ట్ టైటిల్ తెలుసైతే… వారిని వ్యక్తిగతంగా కలుస్తాను” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇది చూసిన వెంటనే అభిమానులు ఉత్సాహంతో గెస్‌లు ప్రారంభించారు. రష్మికను కలవాలన్న ఆసక్తితో వాళ్ల మైండ్‌ని ఫుల్ యాక్టివ్ చేసి టైటిల్‌ను ఊహించే ప్రయత్నంలో పడ్డారు. ఈ ఛాలెంజ్‌ను సోషల్ మీడియాలో చాలామంది ఫాలో అవుతుండగా, “ఈ అవకాశాన్ని మిస్ అవ్వకూడద” అంటూ మరోపక్క ట్రెండ్ కొనసాగుతోంది. మీరు కూడా గెస్ చేసి కామెంట్ చేయండి… రష్మిక మీ ముందే కనిపించే అవకాశం ఉంది