Andhra Pradesh
రవాణా రంగానికి శుభవార్త.. పెరిగిన ఫిట్‌నెస్ ఫీజులపై సర్కార్ బ్రేక్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లారీ యజమానులకు మంచి సమాచారం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సరకు రవాణా వాహనాల ఫిట్‌నెస్ ఫీజులను పెంచాలని జారీ చేసిన నోటిఫికేషన్‌ను రాష్ట్రంలో అమలు చేయకుండా నిర్ణయించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాత ఫిట్‌నెస్ ఫీజులే ఇస్తామని రవాణాశాఖ అధికారులకు ఆదేశించారు. దీని వల్ల ఏపీ అంతటా లారీ యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఈ నెల 11న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 20 ఏళ్ళకు పైగా ఉన్న సరకు రవాణా వాహనాల ఫిట్‌నెస్ ఫీజులు పెరిగాయి. కొన్ని వాహనాల కోసం రూ.33 వేల వరకు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఈ పెంపుగా లారీ యజమానులు తీవ్రమైన ఆర్థిక భారం ఎదుర్కోవాల్సి రావడంతో ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని రహదారి భద్రత సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు లారీ యజమానుల సంఘం ప్రతినిధులు. తమ సమస్యను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి, వెంటనే ఈ ఫిట్‌నెస్ ఫీజుల పెంపు పై పునః పరిశీలన చేయాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల ప్రకారం, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మెమో జారీ చేసారు; కేంద్రం పెంచిన ఫీజులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
అదేవిధంగా, ఇతర రాష్ట్రాల్లో ఈ ఫిట్‌నెస్ ఫీజుల పెంపుపై తీసుకునే నిర్ణయాలను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని రవాణాశాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఆ నివేదిక ఆధారంగా భవిష్యత్తులో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో లారీ యజమానులకు తక్షణ ఉపశమనం వచ్చింది. తమ సమస్యను అర్థం చేసుకుని వెంటనే చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు, రవాణాశాఖ మంత్రి, ఉన్నతాధికారులకు ఏపీ లారీ యజమానుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఈ నిర్ణయం సరుకు రవాణా రంగానికి ఉపశమనాన్ని ఇచ్చింది అని వారు అభిప్రాయపడ్డారు.
#APGovernment#LorryOwners#FitnessFees#ChandrababuNaidu#TransportDepartment#LorryNews#APLatestNews#VehicleFitness
#TruckOwnersRelief#AndhraPradeshNews