Connect with us

International

యూకేలో వినాయక నిమజ్జనం తర్వాత దుర్ఘటన – హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థుల మృతి

image

యూకేలో వినాయక నిమజ్జన వేడుక అనంతరం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

లండన్‌లో నిమజ్జనం ముగించుకుని తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాదర్‌గుల్‌కు చెందిన చైతన్య (22), ఉప్పల్‌కు చెందిన రిషితేజ (21) అక్కడికక్కడే మృతి చెందారు.

అదే ఘటనలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *