Entertainment
యూఎస్‌లో రికార్డులు బద్దలుకొడుతున్న ‘OG
పవన్ కళ్యాణ్ – సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘OG’ అమెరికాలో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ ప్రీ-సేల్స్ అత్యంత వేగంగా 5 లక్షల డాలర్లను దాటాయి అని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఇకపోతే టైటిల్ సాంగ్‌లోని లైన్ *“క్షణక్షణమొక తల తెగి పడెలే”*ను షేర్ చేస్తూ, సినిమా మీద హైప్ మరింత పెంచారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రం థియేటర్లలోకి రానుండగా, ఒక రోజు ముందుగానే (సెప్టెంబర్ 24న) యూఎస్‌లో గ్రాండ్ ప్రీమియర్స్ జరగనున్నాయి.
ఈ క్రేజ్ చూస్తుంటే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి ముందుగానే పండగ మొదలైనట్టే!