Andhra Pradesh
మ్యానిఫెస్టోను డస్ట్‌బిన్‌లో వేసిన బాబు: వైసీపీ నేత రోజా విమర్శ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.కే. రోజా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ‘తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ప్రజలను నమ్మకద్రోహం చేసింది. ఎన్నికల ముందు వాగ్దానించిన విషయాలు అన్నీ మరిచిపోయారు. మ్యానిఫెస్టోను సీఎం చంద్రబాబు డస్ట్‌బిన్‌లో పడేసారు’ అంటూ ఆరోపించారు.
అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కూడా రోజా విమర్శలు చేశారు. ‘చంద్రబాబు పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రజలను మభ్యపెట్టారు. వీరిపై చీటింగ్ కేసు నమోదు చేయాలి’ అని డిమాండ్ చేశారు. ‘సంపద సృష్టిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను అమ్మేయాలని చూస్తోంది. ఇది మంచిదా? ఇది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న ప్రభుత్వమా?’ అంటూ ప్రభుత్వ ధోరణిపై ఆమె ప్రశ్నించారు.