Latest Updates
మెదక్‌లో దారుణం: రైతు భరోసా డబ్బుల కోసం తండ్రి నాలుక కోసిన కుమారుడు
మెదక్ జిల్లా ఔరంగాబాద్ తండాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వంచే జమ చేసిన రూ.9వేలు డబ్బుల విషయంపై తండ్రి, కొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ మొత్తం నుంచి రూ.5వేలు వైద్య ఖర్చుల కోసం ఉంచుకొని, మిగిలిన రూ.4వేలు తన కుమారుడు సురేశ్‌కు ఇచ్చిన రైతు పై సురేశ్ అసంతృప్తిగా ఉన్నాడు.
మొత్తం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన సురేశ్, తండ్రితో ఘర్షణకు దిగాడు. వివాదం తీవ్రమవుతుండగా, కోపావేశంతో తండ్రి నాలుకను కోసిన ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల విచారణ కొనసాగుతోంది