Health

ముడి వంటనూనెపై దిగుమతి సుంకం తగ్గింపు: నూనె ధరల తగ్గింపుకు కేంద్రం చర్యలు

ఎడిబుల్ ఆయిల్ ధర తగ్గింది: ముడి పామాయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్ మరియు  క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై కేంద్రం ప్రాథమిక సుంకాన్ని తగ్గించింది

దేశంలో వంటనూనె ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముడి వంటనూనె దిగుమతిపై విధించే సుంకాన్ని 10 శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 27.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకం ఇకపై 16.5 శాతానికి సవరించబడింది. ఈ నిర్ణయంతో దేశీయ రిఫైనింగ్ పరిశ్రమలపై సుంకం భారం తగ్గడమే కాకుండా, వంటనూనె ధరలు కూడా దిగివచ్చే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.

అయితే, రిఫైన్డ్ పామాయిల్, సోయా, సన్ఫ్లవర్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకం (35.75%)ను కేంద్ర ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ చర్యలు వినియోగదారులకు ఊరటనిచ్చే అవకాశం ఉన్నప్పటికీ, రిఫైన్డ్ నూనెలపై సుంకం తగ్గింపు లేకపోవడం గమనార్హం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version