Connect with us

Business

మీడియా వార్: నెట్‌ఫ్లిక్స్‌ను వెనక్కి నెట్టిన ట్రంప్ మార్క్ రాజకీయం.. వార్నర్ బ్రదర్స్ ఇక పారామౌంట్ సొంతం!

#నెట్‌ఫ్లిక్స్ #వార్నర్బ్రదర్స్ #డొనాల్డ్_ట్రంప్ #పారామౌంట్ #హాలీవుడ్_డీల్ #మీడియా_వార్ #బిజినెస్_న్యూస్ #అమెరికా_రాజకీయాలు #స్కైడ్యాన్స్ #బిడ్డింగ్_యుద్ధం #బిగ్_డీల్ #స్ట్రీమింగ్_వార్స్

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని దక్కించుకునేందుకు జరిగిన భారీ బిడ్డింగ్ యుద్ధంలో నెట్‌ఫ్లిక్స్ ఓటమిని అంగీకరించింది. ఈ పరిణామంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పంతం నెగ్గించుకున్నట్లయింది. వార్నర్ బ్రదర్స్ స్టూడియోలు, స్ట్రీమింగ్ విభాగాల కోసం నెట్‌ఫ్లిక్స్, పారామౌంట్ స్కైడ్యాన్స్ పోటీ పడ్డాయి. మొదట నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదిరినప్పటికీ, ట్రంప్ జోక్యంతో సమీకరణాలు మారిపోయాయి. నెట్‌ఫ్లిక్స్ ఒక్కో షేరుకు 28 డాలర్లు ఆఫర్ చేయగా, పారామౌంట్ ఏకంగా 30 డాలర్లు ఆఫర్ చేస్తూ ‘హాస్టైల్ బిడ్’ వేసింది. ఇదే మెరుగైన ఆఫర్ అని వార్నర్ బ్రదర్స్ బోర్డు ప్రకటించింది.

 పారామౌంట్ స్కైడ్యాన్స్ వెనుక ట్రంప్ సన్నిహితుడు, ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ కుటుంబం ఉంది. ఈ డీల్ ద్వారా హాలీవుడ్‌లోని ప్రధాన స్టూడియోలన్నీ ఒకే గొడుగు కిందకు రానున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ వైట్ హౌస్‌కు వెళ్లి వచ్చిన కొద్ది సేపటికే, ఈ డీల్ నుండి తప్పుకుంటున్నట్లు అధికారిక ప్రకటన వెలువడటం గమనార్హం. ఈ పరిణామంతో సీఎన్ఎన్ (CNN), హెచ్‌బీఓ (HBO), కేబుల్ బిజినెస్ వంటివన్నీ ఇప్పుడు స్కైడ్యాన్స్ నియంత్రణలోకి వెళ్లనున్నాయి.అయితే, ఈ భారీ విలీనం వల్ల మార్కెట్లో ఏకఛత్రాధిపత్యం ఏర్పడుతుందన్న ఆందోళనతో అమెరికా మరియు ఇతర దేశాల్లో యాంటీ ట్రస్ట్ (Antitrust) విచారణలు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *