International
‘మా బడ్జెట్.. మీ అప్పు కంటే రెట్టింపు’: పాకిస్థాన్‌ను ఉతికి ఆరేసిన భారత్!
జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిపై పాకిస్థాన్ చేస్తున్న విష ప్రచారాన్ని భారత ప్రతినిధి అనుపమ సింగ్ గట్టిగా తిప్పికొట్టారు. పాక్ చేస్తున్న ఆరోపణల చూస్తుంటే ఆ దేశం వాస్తవాలకు దూరంగా ఏదో భ్రమల్లో బతుకుతున్నట్లు కనిపిస్తోందని ఆమె ఎద్దేవా చేశారు,ఆర్థికంగా పరువు తీసిన భారత్, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం భారత్ కేటాయించిన వార్షిక బడ్జెట్, పాకిస్థాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నుండి పొందిన అత్యవసర అప్పు (బెయిలౌట్ ప్యాకేజీ) కంటే రెండు రెట్లు ఎక్కువ అని అనుపమ సింగ్ పేర్కొన్నారు.ప్రజాస్వామ్యంపై కౌంటర్, సొంత దేశంలో కనీసం ఐదేళ్ల పాటు సివిలియన్ ప్రభుత్వం మనలేకపోయే పాకిస్థాన్, భారత్‌కు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు.
అభివృద్ధిపై కాశ్మీర్‌లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని చూసి పాక్ తట్టుకోలేకపోతోందని, అందుకే దానిని ‘నకిలీ’ అని ప్రచారం చేస్తూ తన మానసిక స్థితిని బయటపెట్టుకుందని ధ్వజమెత్తారు,ఓఐసీ (OIC)కి పాకిస్థాన్ ఇచ్చే తప్పుడు సమాచారాన్ని గుడ్డిగా నమ్ముతున్న ఇస్లామిక్ సహకార సంస్థ వైఖరిని కూడా భారత్ తప్పుబట్టింది,జమ్మూ కాశ్మీర్ భారత్‌లో విడదీయలేని భాగమని పునరుద్ఘాటించిన భారత్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను ఖాళీ చేయడమే అసలైన వివాదమని స్పష్టం చేసింది. అంతర్జాతీయ వేదికలపై బురద జల్లడం మానేసి, పాకిస్థాన్ తన దేశంలో ముదురుతున్న ఆర్థిక, అంతర్గత సంక్షోభాలను పరిష్కరించుకుంటే మంచిదని హితవు పలికింది.
![]()
