Andhra Pradesh
మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం ‘RT76’ ప్రారంభం: కిషోర్ తిరుమల దర్శకత్వంలో
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘RT76’ ఈ రోజు హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి, వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసేలా చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కిషోర్ తిరుమల గతంలో ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘చిత్రలహరి’, ‘రెడ్’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన రవితేజ లాంటి మాస్ హీరోతో కలిసి పనిచేయడం పట్ల అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం రవితేజ యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ శైలికి తగ్గట్టుగా రూపొందనుందని, అదే సమయంలో కిషోర్ తిరుమల మార్క్ సెన్సిబుల్ నరేషన్‌తో ప్రేక్షకులను అలరించనుందని సమాచారం.
‘RT76’ చిత్రం రవితేజ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని టాక్. ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.