Andhra Pradesh
మాస్ జాతర’ ఆగస్టు 27న గ్రాండ్ రిలీజ్
మాస్ మహారాజ రవితేజ, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాస్ జాతర’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27, 2025న గ్రాండ్‌గా విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా మేకర్స్ ‘ఈసారి పండక్కి సౌండ్ మామూలగుండదు’ అంటూ ఉత్సాహం నింపే ట్యాగ్‌లైన్‌తో స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌తో రవితేజ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు శ్రీలీల గ్లామర్, భాను భోగవరపు డైరెక్షన్‌తో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుందని టాక్. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.