International
మాల్దీవులకు రూ.4,850 కోట్ల లోన్: కీలక ఒప్పందాలతో మోదీ పర్యటన
మాల్దీవుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంతో కీలక ఒప్పందాలను చేసుకున్నారు. భారత్ తరఫున మాల్దీవులకు ఇచ్చే ‘లైన్ ఆఫ్ క్రెడిట్’ (రుణం) మొత్తాన్ని రూ.4,850 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ద్వైపాక్షిక సంబంధాల భాగంగా ఇండియా-మాల్దీవుల ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌పై చర్చలు ప్రారంభమైనట్టు వెల్లడించారు.
ఈ సందర్భంగా మోదీ ‘అద్దు’ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే మాల్దీవులకు అవసరమైన 72 వాహనాలను భారత్ తరఫున అందజేశారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు దోహదపడనుందని అంచనాలు ఉన్నాయి.