‘మహావతార్ నరసింహ’ మేకర్స్‌కు 450% లాభం: హొంబలేకు మరో బ్లాక్‌బస్టర్
యానిమేటెడ్ విభాగంలో మరో సెన్సేషన్‌గా నిలుస్తోంది ‘మహావతార్ నరసింహ’. హొంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ ఆధ్యాత్మిక యానిమేటెడ్ మూవీ జులై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన 10 రోజుల్లోనే ఈ చిత్రం రూ.110 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచింది. వీజువల్ ఎఫెక్ట్స్, ఆధ్యాత్మికత, రుద్ర నరసింహ స్వరూపం… అన్నింటి సమ్మేళనంతో ఈ యానిమేటెడ్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
సినిమా నిర్మాణానికి రూ.20 కోట్ల వరకూ ఖర్చయిందన్న సమాచారం. కానీ ఈ పెట్టుబడిపై మేకర్స్‌కు కేవలం థియేట్రికల్ వసూళ్ల ద్వారానే 450% లాభాలు వచ్చాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో యానిమేషన్‌కు ఈ స్థాయిలో ఆదరణ దక్కడం, అదే సమయంలో డబ్బులు వెచ్చించిన మేకర్స్‌కు భారీగా లాభాలు రావడం అరుదైన విషయమే. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం తెలుగు, హిందీ, కన్నడతో పాటు ఇతర భాషలలోనూ మంచి స్పందన పొందుతోంది.
ఇంతకు ముందు ‘కాంతార’ వంటి విభిన్నమైన చిత్రాన్ని రూపొందించి రూ.16 కోట్ల బడ్జెట్‌పై రూ.450 కోట్ల వసూళ్లు సాధించిన హొంబలే ఫిల్మ్స్, ఇప్పుడు ‘మహావతార్ నరసింహ’తో మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇది కేవలం వాణిజ్య విజయమే కాకుండా, యానిమేటెడ్ సినిమాలపై ఉన్న అనుమానాలను తొలగిస్తూ ఒక నూతన ట్రెండ్‌కు దారితీస్తోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.