Andhra Pradesh
మరో అల్పపీడనం.. రాష్ట్రంలో భారీ వర్షాల సూచనలు
బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3న కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ఇది సెప్టెంబర్ 5 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.
ఇక ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మిగతా జిల్లాల్లో ఎక్కడక్కడ తేలికపాటి వానలు పడతాయని సంస్థ తెలిపింది.
Continue Reading