Entertainment
మరింత ఫిట్‌గా రోహిత్ శర్మ – కొత్త లుక్ వైరల్
టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హిట్మ్యాన్ జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఈ వీడియోలో ఆయన స్లిమ్‌గా, మరింత ఫిట్‌గా కనిపిస్తున్నారు. వరుస సిరీస్‌లలో బిజీగా ఆడినప్పుడు కంటే ఇప్పుడు ఆయన శరీరాకృతి మరింత కాంపాక్ట్‌గా, ఎనర్జీతో నిండుగా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
బెంగళూరులో ఇటీవల జరిగిన యోయో, బ్రాంకో ఫిట్నెస్ టెస్టుల్లో రోహిత్ విజయవంతంగా పాస్ అయ్యారు. ఈ పరీక్షల్లో ఆయన ప్రదర్శన టీమ్ మేనేజ్‌మెంట్‌ను సంతృప్తి పరచడమే కాకుండా, అభిమానుల్లో కూడా విశ్వాసాన్ని పెంచింది. రోహిత్ ప్రదర్శనలో ఈ మార్పు భవిష్యత్తులో టీమ్ ఇండియాకు మరింత బలాన్ని అందిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
రోహిత్ ఫిట్‌నెస్ వెనుక ప్రధాన కారణం కోచ్, ట్రైనర్ అభిషేక్ నాయర్ అని తెలుస్తోంది. ఆయన పర్యవేక్షణలో రోహిత్ కఠినమైన వర్కౌట్ రొటీన్ ఫాలో అవుతున్నారు. శరీరాన్ని లైట్‌గా, ఫ్లెక్సిబుల్‌గా మార్చుకునే దిశగా చేస్తున్న ఈ సాధన రాబోయే వరల్డ్‌కప్‌లో రోహిత్ శక్తివంతమైన ఆటతీరుకు బాటలు వేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.