National
మన ప్రీతి బంగారం సార్..!
పంజాబ్ కింగ్స్ జట్టు ఓనర్, బాలీవుడ్ నటి ప్రీతి జింటా గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎల్ ట్రోఫీ దక్కకపోవడంతో ఎమోషనల్ అయిన ఆమె, తన సినిమా కెరీర్‌తో పాటు సమాజ సేవలోనూ మునిగి తన గొప్ప మనసును చాటుకుంది. ఆమె ఏకంగా 34 మంది అమ్మాయిలను దత్తత తీసుకుని వారి బాగోగులను చూస్తున్న విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయం నెట్టింట చక్కర్లు కొడుతూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
ప్రీతి జింటా తనకు కవలలు జన్మించకముందే 34 మంది అమ్మాయిలకు తల్లిగా మారినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వారి చదువు, ఆహారం, బట్టలు, ఇతర అవసరాలన్నీ తానే స్వయంగా చూసుకుంటానని ఆమె తెలిపారు. ఈ అమ్మాయిల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఆమె చేస్తున్న కృషి అభినందనీయం. సినిమా, క్రీడలతో పాటు సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేస్తూ ప్రీతి జింటా అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.