Andhra Pradesh
భారీ వర్షాలు.. ప్రభుత్వ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
హోంమంత్రి అనిత అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందించాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఇక వర్షాల ప్రభావం సముద్రంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని మంత్రివర్యులు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.