Business
భారత రిఫైనరీల ప్రకటన: “రష్యా ఆయిల్ కొనుగోలు కొనసాగుతుంది
భారత ఆయిల్ రిఫైనరీలు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న తమ విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. ధరలు, ఆయిల్ గ్రేడ్, రవాణా వ్యయం, ఇతర ఆర్థిక పరిస్థితులను బట్టి రష్యా సప్లైపై ఆధారపడతామని పేర్కొన్నాయి. వాణిజ్య పరమైన లెక్కల మీద ఆధారపడి కొనుగోలు నిర్ణయాలు తీసుకుంటామని కంపెనీలు తెలిపాయి.
ఈ ప్రకటన, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల అనంతరం రావడం గమనార్హం. రష్యా నుంచి భారత్ క్రూడాయిల్ దిగుమతులు నిలిపేశాయన్న ట్రంప్ వ్యాఖ్యలకు బదులుగా, భారత్ రిఫైనరీలు స్పష్టత ఇచ్చాయి. ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారగా, వాటిని భారత అధికారిక వర్గాలు నిశ్శబ్దంగా త్రోవడం విశేషం.
రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులపై భారత్ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపనుంది. భారత్ లాంటి పెద్ద కొనుగోలుదారు రష్యా ఆయిల్‌ను వదిలేస్తే, గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌లో ధరలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత రిఫైనరీలు తమ విధానాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.