International
భారత డ్యామ్ ను మిస్సైళ్లతో పేల్చేస్తాం: పాక్ ఆర్మీ చీఫ్
అమెరికాలో పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధూ నది మీద భారత్ డ్యామ్ నిర్మిస్తే తాము సహించబోమని హెచ్చరించారు. భవిష్యత్తులో తమ దేశానికి భారత నుంచి ముప్పు వస్తుందని అనిపిస్తే, సగం ప్రపంచాన్ని కూడా మాతో పాటు ధ్వంసం చేస్తామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
డ్యామ్ నిర్మాణం జరిగితే, ఒక్కసారిగా 10 మిస్సైళ్లతో దానిని పేల్చేస్తామని మునీర్ ప్రకటించారు. సింధూ నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదని, ఆ నీటి హక్కుల విషయంలో పాకిస్తాన్‌కు కూడా సమాన హక్కులున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్ వెనక్కి తగ్గకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
తమ దేశం అణ్వాయుధ శక్తి కలిగినదని గుర్తుంచుకోవాలని ఆసిమ్ మునీర్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ వద్ద మిస్సైళ్ల కొరత లేదని, అవసరమైతే వాటిని వినియోగించడానికి వెనుకాడమని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు భారత్–పాక్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.