Business
భారత్‌లో ఐఫోన్ యూజర్లకు సూపర్ ఆఫర్: కేవలం ₹799కే AppleCare+ — 2 ఏళ్ల పూర్తి రక్షణ!
భారతదేశంలోని ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ భారీ శుభవార్త అందించింది. ఐఫోన్ యూజర్లు ఇప్పుడు చాలా తక్కువ ధరలో AppleCare+ రక్షణ పొందే వీలుంది. కొత్త ప్లాన్ ప్రకారం, కేవలం ₹799 నుంచి ప్రారంభమయ్యే ధరతో మొత్తం 2 ఏళ్ల వరకు డివైస్ ప్రొటెక్షన్ కవర్ చేసుకునే అవకాశాన్ని యాపిల్ అందిస్తోంది. దేశంలో పెరుగుతున్న ఐఫోన్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని, యాపిల్ ఈ ప్రత్యేక ప్లాన్‌ను భారత్‌లో మొదటిసారి అధికారికంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ AppleCare+ ప్లాన్ ద్వారా ఐఫోన్ 13 నుండి ఐఫోన్ 17 వరకు, అలాగే iPhone SE మోడల్స్ వరకు కవరేజ్ అందుతుంది. ఇప్పటి వరకు వినియోగదారులు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీలపై ఆధారపడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు యాపిల్ అధికారికంగా ఫిజికల్ డ్యామేజ్, లాస్, థెఫ్ట్ వంటి సమస్యలకు ప్రతీ ఏటా రెండు క్లెయిమ్‌లు చేసుకునే అవకాశం కల్పించింది. సాధారణంగా ఐఫోన్ కొనుగోలు చేస్తే ఒక సంవత్సరం వారంటీ మాత్రమే లభిస్తుంది, కానీ AppleCare+ తీసుకుంటే ఆ రక్షణ రెండు సంవత్సరాల వరకు పొడిగించబడుతుంది.
క్రొత్త ప్లాన్‌లో ప్రమాదవశాత్తు జరిగిన నష్టాలకు అన్‌లిమిటెడ్ రిపేర్స్, ప్రైయారిటీ సపోర్ట్, బ్యాటరీ రీప్లేస్మెంట్ వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. డివైస్ రిపేర్ మొత్తం యాపిల్ స్టోర్స్ లేదా ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లలోనే జరుగుతుంది కాబట్టి, వినియోగదారులు ఒరిజినల్ భాగాలతోనే రిపేర్ పొందుతారు. ఇది భారత మార్కెట్‌లో ఉన్న ఇతర మొబైల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో పోలిస్తే పెద్ద ప్రయోజనంగా నిలుస్తోంది.
యాపిల్ వైస్ ప్రెసిడెంట్ కైయాన్ డ్రాన్స్ ప్రకారం, కొత్తగా ఐఫోన్ కొనుగోలు చేసిన వెంటనే లేదా 60 రోజుల లోపు AppleCare+ కోసం సబ్‌స్క్రైబ్ కావచ్చు. యాపిల్ సెట్టింగ్స్ యాప్ ద్వారా నేరుగా ప్లాన్ కొనుగోలు చేయడం కూడా చాలా సులభం. భారత వినియోగదారులకి తక్కువ ధరలో పూర్తి రక్షణ అందించాలనే లక్ష్యంతో AppleCare+ ను అధికారికంగా భారత్‌లో ప్రారంభించామని యాపిల్ ప్రకటించింది.
![]()
