International
భారత్‌తో సీజ్‌ఫైర్‌ను మేమే కోరామని పాక్ డిప్యూటీ PM ఇషాఖ్ దార్ వెల్లడి
ఆపరేషన్ సిందూర్ అనంతరం జరిగిన పరిణామాలపై పాకిస్థాన్ డిప్యూటీ ప్రధానమంత్రి ఇషాఖ్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక టెలివిజన్ కార్యక్రమంలో ఆయన నిజాలను బయటపెట్టారు.
ఇషాఖ్ దార్ మాట్లాడుతూ, “మేము దాడికి సిద్ధమయ్యేలోపే భారత్ మరోసారి అర్ధరాత్రి 2:30 గంటలకు దాడి చేసింది. నూరాఖాన్ మరియు షోర్కాట్ బేస్‌లను ధ్వంసం చేసింది. ఈ పరిస్థితిలో మేము వెంటనే అమెరికాతో సంప్రదింపులు జరిపాము. అనంతరం, ఉదయం 4:45 గంటలకు సౌదీ అరేబియా ప్రిన్స్ ఫైజల్ నాకు ఫోన్ చేసి, పాకిస్థాన్ సీజ్‌ఫైర్‌కు సిద్ధంగా ఉందని భారత్‌కు తెలియజేయాలా అని అడిగారు. దానికి నేను సమ్మతం తెలిపాను,” అని వివరించారు.
ఈ వ్యాఖ్యలు ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయాలను మరియు దాని వెనుక జరిగిన దౌత్యపరమైన చర్యలను స్పష్టం చేస్తున్నాయి.