Latest Updates
భాగ్యనగరంలో ఏసీ బస్సు ప్రయాణం చౌక ధరలకే: 30% ధరల తగ్గింపు!
ఎండలు ముదురుతున్న వేళ హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) బంపర్ ఆఫర్ ప్రకటించింది. నగరంలోని ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ధరలపై 30 శాతం తగ్గింపు ఇవ్వాలని నిర్ణయించింది.
ఏసీ బస్సు టికెట్ ధరల్లో 30% రాయితీ,గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మాత్రమే వర్తిం పు,మార్చి 1వ తేదీ నుండి మే నెల చివరి వరకు ఈ తగ్గింపు. మెట్రో ఎక్స్‌ప్రెస్ ధరలకే ఏసీ ప్రయాణం:సాధారణంగా ఏసీ బస్సుల్లో ఛార్జీలు ఎక్కువగా ఉంటాయని భావించే మధ్యతరగతి ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు టికెట్ ధరతోనే ఏసీ బస్సుల్లో హాయిగా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం నగరంలో అందుబాటులో ఉన్న 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో ఈ రాయితీ వర్తించనుంది.
మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో సాధారణ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. టికెట్ కొని ప్రయాణించే వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వారిని ఏసీ బస్సుల వైపు మళ్లించేందుకు ఈ తగ్గింపు ఎంతగానో ఉపయోగపడనుంది. అదనంగా మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కూడా రోడ్లపైకి తెచ్చేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది.
![]()
