Latest Updates
భవిష్యత్తులో 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం: సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత, అసెంబ్లీకి పోటీ చేసే వారి కనీస వయసు పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి సీఎం రేవంత్ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉండాలన్న దృక్పథంతోనే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయో పరిమితిని 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారని గుర్తు చేశారు. అదే దారిలో ముందుకు సాగుతూ, ఎమ్మెల్యే పోటీ వయస్సును కూడా తగ్గించే ప్రయత్నం జరుగుతుందని వెల్లడించారు.