Latest Updates
బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు – పోలీసుల అప్రమత్తత
హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి ఈ ఉదయం బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో సెక్యూరిటీ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో కలిసి విస్తృత తనిఖీలు చేపట్టారు. విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో క్షుణ్నంగా గాలింపు నిర్వహించారు.
తుదకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి పంపించబడింది? దాని వెనుక ఎవరు ఉన్నారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తునుAlready ప్రారంభించారు. భద్రతా పరంగా ఎలాంటి ప్రమాదం లేదని అధికారికంగా వెల్లడించారు