National
బెంగళూరు నుంచి ముంబైకి విరాట్
బెంగళూరు: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన భార్య అనుష్కా శర్మతో కలిసి బెంగళూరు నుంచి ముంబైకి చేరుకున్నారు. గురువారం ఉదయం వీరిద్దరూ బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ భద్రత మధ్య కనిపించారు. ఐపీఎల్ 2025 ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) గెలుచుకోవడంతో కోహ్లి సంతోషంగా ఉండాల్సిన సమయంలో, ఎయిర్పోర్టులో ఆయన ముఖంలో విచారం కనిపించింది. ఈ విజయం ఆర్‌సీబీ అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చినప్పటికీ, కోహ్లి బాధగా కనిపించడం గమనార్హం.
ఈ విషయంపై నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. నిన్న బెంగళూరులో జరిగిన విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన ఘటనలో కొంతమంది అభిమానులు చనిపోవడమే కోహ్లి విచారానికి కారణమని వారు పోస్టులు చేస్తున్నారు. ఈ ఘటన ఆర్‌సీబీ జట్టు విజయ ఆనందాన్ని మసకబార్చిందని, అందుకే కోహ్లి బాధగా కనిపించాడని నెటిజన్లు అంటున్నారు. ఈ విషాద ఘటన కోహ్లి మనసును కలిచివేసినట్లు తెలుస్తోంది, దీనిపై అధికారిక వివరణ ఇంకా రావాల్సి ఉంది.