Latest Updates

బెంగళూరు తొక్కిసలాట ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు సీఎం సిద్దరామయ్య ఆదేశం

మరో ఐదేళ్లు సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య అన్నారు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనలో 10 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా, బీజేపీ నుంచి వస్తున్న విమర్శలకు సీఎం సిద్దరామయ్య తీవ్రంగా స్పందించారు. “మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగినప్పుడు మీరు ఏం చేశారు?” అని బీజేపీ నేతలను ప్రశ్నిస్తూ కౌంటర్ ఇచ్చారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తూ, 15 రోజుల్లో విచారణ కమిషన్ నివేదిక సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు.

సీఎం సిద్దరామయ్య ఈ ఘటనను రాజకీయం చేయాలని తాము భావించడం లేదని, అలాగని జరిగిన దాన్ని సమర్థించుకోవడం కూడా లేదని తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, స్టేడియం గేట్లను అభిమానులు బద్దలు కొట్టుకొని లోపలికి దూసుకొచ్చే సమయంలో ఈ తొక్కిసలాట జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటన బాధ్యులను గుర్తించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించాలని సీఎం పేర్కొన్నారు. ఈ విషాదం జనసమూహ నిర్వహణలో లోపాలను బట్టబయలు చేసిన నేపథ్యంలో, విచారణ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version