Health
బెంగళూరులో 9 నెలల చిన్నారికి కొవిడ్
బెంగళూరులోని హోస్కోటేకు చెందిన తొమ్మిది నెలల చిన్నారికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. ఆ చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు బెంగళూరులోని కలాసిపాళ్యలో ఉన్న వాణి విలాస్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆ శిశువుకు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటన బెంగళూరులో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయనే ఆందోళనను రేకెత్తిస్తోంది. శిశువు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, చిన్నారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నారు. అధికారులు తల్లిదండ్రులను కూడా పరీక్షించి, సంబంధిత మార్గదర్శకాలను అనుసరిస్తున్నారు. ప్రజలు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు.