Entertainment
బీస్ట్ మోడ్‌లో సంజూ శాంసన్ – మరో హాఫ్ సెంచరీ
కేరళ క్రికెట్ లీగ్ (KCL)లో కొచ్చి బ్లూ టైగర్స్ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నారు. ఆదానీ త్రివేండ్రం రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన మరోసారి రెచ్చిపోతూ హాఫ్ సెంచరీ బాదారు. కేవలం 37 బంతుల్లోనే 4 బౌండరీలు, 5 భారీ సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి తన జట్టుకు బలమైన స్థానం ఇచ్చారు.
ఇది కేవలం ఒకే మ్యాచ్‌లో మాత్రమే కాకుండా, గత రెండు మ్యాచ్‌ల్లోనూ సంజూ శాంసన్ ఘనతలు సాధించిన సంగతి తెలిసిందే. త్రిస్సూర్ టైటాన్స్‌పై 89 పరుగులు, కొల్లం సెయిలర్స్‌పై అద్భుతంగా 121 పరుగులు బాదిన ఆయన, వరుస ఇన్నింగ్స్‌లలో రన్ ఫ్లో కొనసాగిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో బౌలర్లపై విరుచుకుపడుతూ సంజూ తన అగ్రెసివ్ బ్యాటింగ్ శైలిని మరింత స్పష్టంగా చూపిస్తున్నారు.
తాజా ఫామ్‌తో సంజూ శాంసన్ మళ్లీ టీమ్ ఇండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రత్యేకంగా ఓపెనర్ స్థానానికి గట్టి పోటీ ఇస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు మరింత బలమైన ఆప్షన్‌గా మారే అవకాశముందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.