Latest Updates
బీజేపీ మార్క్ ‘అభివృద్ధి’ ఇదేనా?: కేటీఆర్ సెటైర్లు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ పాలనపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. రూ.430 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్, ఢిల్లీ విమానాశ్రయం వంటి భారీ నిర్మాణాలు సాధారణ వర్షానికే దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మార్క్ పాలనలో ‘అభివృద్ధి’కి ఇదే నిర్వచనమని విమర్శిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గత ఏడాది ఢిల్లీ విమానాశ్రయంలో పైకప్పు కుప్పకూలిన ఘటనను ప్రస్తావిస్తూ, “ఇదేనా బీజేపీ అభివృద్ధి?” అని కేటీఆర్ ప్రశ్నించారు. “పైకప్పులు నిర్మించడం కూడా రాని వారు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడటం చూస్తే జాలి కలుగుతోంది” అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. బీజేపీ పాలనలో నాణ్యత లోపించిన నిర్మాణాలపై ఈ ట్వీట్ ద్వారా కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.