Entertainment
బిచ్చగాడిగా అల్లరి నరేశ్ నటన గుర్తుందా?
అవునా.. బిచ్చగాడిగా అల్లరి నరేశ్ నటన గుర్తుందా?
ఇప్పుడు ధనుష్ “కుబేరా” సినిమాలో చూపించిన బిచ్చగాడి లుక్, నటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ధనుష్ నటన చూసి థియేటర్లలో అలుపెరిగిన టపాలా చప్పట్లు పడుతుంటే.. నెట్టింట మరో పేరు కూడా జనం గుర్తు చేసుకుంటున్నారు. ఎవరో కాదు.. మన అల్లరి నరేశే!
అది “పెళ్లయింది కానీ!” సినిమా టైం. కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న నరేశ్, అందులో ఓ దృశ్యానికి అందరి హృదయాలను తాకేలా నటించాడు. కథలో ఓ టర్నింగ్ పాయింట్లో అతను జీవితంలో అన్ని కోల్పోయి, రోడ్డుపై బిచ్చగాడిలా తిరిగే సీన్ ఉంటుంది. అప్పటివరకు నవ్విస్తూ అలరించిన హీరో ఒక్కసారిగా తన Expressions తో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాడు. ఆయన కళ్లు, ఆ వేషధారణ, మాట్లాడే తీరు — అన్నీ కలిసొచ్చి ఆ సీన్‌ను ఓ క్లాసిక్‌లా మార్చేశాయి.
ఇప్పుడు అదే ఎమోషన్ “కుబేరా”లో ధనుష్ నటనలో కనిపిస్తోందని, అప్పట్లో అల్లరి నరేశ్ చేసిన అద్భుత ప్రదర్శనను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. “ఇప్పుడు ధనుష్, అప్పడు నరేశ్.. ఇద్దరూ నటనలో అద్భుతంగా రూల్ చేశారు” అంటూ నెట్టింట కామెంట్లు వర్షంలా కురుస్తున్నాయి.
ఒక వైపు ధనుష్ తన మాస్ ఇమేజ్‌తో ప్రేక్షకులను మెప్పిస్తుంటే, మరోవైపు నరేశ్ కామెడీ బ్రాండులోనూ ఎంత లోతైన నటన చూపించగలడో అప్పుడే రుజువు చేశాడు.