Devotional

బాలాపూర్ గణేష్ లడ్డు

బాలాపూర్‌ గణేశుడి తో పాటు పదిరోజులు భక్తులతో పూజలను అందుకున్నలడ్డూరికార్డ్ఈ ఏడాది బాలాపూర్‌లడ్డూ ని బిజేపీ సీనియర్ నేత కొలను శంకర్‌రెడ్డి దక్కించుకున్నారు.  వేలంపాట లో గత రికార్డ్ బీట్  చేస్తూ 30 లక్షల వెయ్యిరూపాయలకు శంకర్రెడ్డి  దక్కించుకున్నారు.

హైదరబాద్ లో  ఒక వైపు గణపతి నిజమజ్జనం వేడుక అంగరంగ  వైభవంగా సాగుతోంది మరో వైపు ఖైదరాబాద్ వినాయకుడు గంగమ్మ చెంతకు శోభాయత్ర గాపయనం అయ్యాడు ఇదే సమయంలో బాలాపూర్‌ గణేశుడితో పాటు పదిరోజులు భక్తులతో పూజలను అందుకున్న లడ్డూ రికార్డు ధర  పలికింది ఈఏడాది బాలాపూర్‌ లడ్డూని బిజేపీ సీనియర్ నేత కొలను శంకర్‌రెడ్డి దక్కించుకున్నారు.

అయితే ఈ ఏడాది బాలాపూర్‌ లడ్డూవేలం పాట నిబంధనల్లో కొన్ని మార్పులు చేశారు లడ్డువేలంపాటలో పాల్గొనడానికి దక్కించుకోవడానికి ఈఏడాది డిపాజిట్  తప్పనిసరి చేశారు. అది కూడా గత ఏడాది లడ్డు ధరైనా 27 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం నిబంధన పెట్టారు. దీంతో ఈలడ్డుని దక్కించుకోవాడానికి చైతన్యస్టిల్స్ అదినేత లింగాల దశరధ్ గౌడ్, సాహెబ్ నగరానికి చెందిన అర్బన్ గ్రూప్ అధినేత ప్రణీత్ రెడ్డి, బాలాపూర్ కి చెందిన బిజేపి సీనియర్ లీడర్ కోలన్ శంకర్ రెడ్డి, నాదర్గులు కి చెందిన   శ్రీ గీతా డైరీ అధినేత లక్ష్మీనారాయణలు వేలంపాటలో పాల్గొనడానికి కావాల్సిన డిపాజిట్ కట్టారు. చివరికి శంకర్‌రెడ్డి  బాలాపూర్  లడ్డు 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డు సొంతం చేసుకున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version