Entertainment
బర్త్‌డే రోజే ట్రెండింగ్.. సిగరెట్ స్టైల్, ప్రభాస్ స్మైల్‌తో వార్తల్లో శ్రుతి హాసన్

శ్రుతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులకు డబుల్ ట్రీట్ లభించింది. ప్రస్తుతం శ్రుతి హాసన్ నటిస్తున్న చిత్రాల నుంచి వచ్చిన లేటెస్ట్ అప్‌డేట్స్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో శ్రుతి హాసన్ కీలక పాత్రలో కనిపించనుండటం ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
ఈ సినిమాలో శ్రుతి పాత్రను చూపించే మొదటి పోస్టర్ చాలా ఆకర్షణీయంగా ఉంది. శ్రుతి సిగరెట్ తాగుతూ ఉంటుంది. ఆధునిక యువతిలా కనిపిస్తుంది. ఇది అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మరో పోస్టర్‌లో శ్రుతి తన జుట్టు విప్పి ఉంటుంది. ఆమె ఆత్మవిశ్వాసంతో నిలబడి ఉంది. ఆమె పాత్ర బలాన్ని చెప్పకనే చెబుతోంది. సినిమా బృందం శ్రుతి పాత్రపై ఆసక్తికరమైన విషయాలను చెప్పింది. శ్రుతి ప్రతి విషయంలో తనదైన మార్గాన్ని ఎంచుకుంటుందని చెప్పింది.
స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్, లైట్‌బాక్స్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. ఇదే సినిమాతో సాత్విక వీరవల్లి అనే మరో తెలుగు అమ్మాయి ఇండస్ట్రీకి పరిచయం కానుంది.
సలార్ టీమ్ శ్రుతి హాసన్‌కు బర్త్‌డే విషెస్ తెలిపింది. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ పార్ట్ 1లో శ్రుతి ఆద్య పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సలార్ 2 – శౌర్యాంగ పర్వంలో కూడా శ్రుతి కీలకంగా కనిపించనుంది. సలార్ టీమ్ ప్రభాస్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. సలార్ 2 సెట్స్‌లో మిమ్మల్ని తిరిగి చూడాలని ఎదురుచూస్తున్నాం అంటూ వారు పోస్ట్ చేశారు. అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్, తొలి దశలో విమర్శలు ఎదుర్కొన్నా… క్రమంగా వరుస హిట్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సెలెక్టివ్ సినిమాలతో ముందుకెళ్తున్న శ్రుతి, బర్త్‌డే స్పెషల్‌గా వచ్చిన ఈ పోస్టర్లతో మరోసారి వార్తల్లో నిలిచింది.
#ShrutiHaasan#HappyBirthdayShrutiHaasan#AakasamLoOkaTara#DulquerSalmaan#PawanSadineni#Salaar2#Prabhas
#SalaarShouryangaParvam#TollywoodUpdates#BirthdaySpecial#StarHeroine#MovieBuzz#CinemaNewsTelugu