Entertainment

బడ్జెట్ తక్కువ.. లాభాలెక్కువ!

Mahavatar Narsimha: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న యానిమేటెడ్ మూవీ.. బడా  హీరోలను నెట్టేసి రూ. 100 కోట్ల దిశగా!

ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర లోబడ్జెట్ సినిమాలు భారీ సక్సెస్ సాధిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో నిర్మించినా, కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనేది మరోసారి రుజువైంది. పెద్ద సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా, చిన్న సినిమాలు కూడా వసూళ్ల పరంగా అద్భుత ఫలితాలు చూపుతున్నాయి.

ఉదాహరణకు, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కేవలం ₹50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినా, బాక్సాఫీస్ వద్ద గట్టిగా దూసుకుపోయి రూ.303 కోట్లు వసూలు చేసింది. అదే తరహాలో, ‘మహావతార్ నరసింహ’ సినిమా మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం ₹15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, రూ.315 కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేస్తూ పరిశ్రమ మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. మరోవైపు అహాన్ పాండే హీరోగా వచ్చిన ‘సైయారా’ (₹40Cr) చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ.569 కోట్లకుపైగా వసూళ్లతో రికార్డులు బద్దలుకొట్టింది.

అదే సమయంలో, సీనియర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘తుడరుమ్’ సినిమా రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, రూ.235 కోట్ల వరకు రాబట్టగా, దుల్కర్ నిర్మించిన ‘కొత్త లోక’ సినిమా రూ.30 కోట్ల పెట్టుబడితో రూ.185 కోట్లకుపైగా సంపాదించింది. ఇలా ఒక్కొక్కటి సక్సెస్ దిశగా పరిగెత్తుతూ, చిన్న సినిమాలు కూడా పెద్ద సినిమాలకు పోటీగా నిలుస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే — ఈ హిట్ సినిమాల్లో మీకు బాగా నచ్చింది ఏది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version