International

బంగ్లా సైన్యంలో భారీ ప్రక్షాళన…భారత్‌లో ఉన్న అడ్వైజర్‌కు కీలక పదవి!

బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం దాదాపు 18 నెలల తాత్కాలిక పాలన తర్వాత  బాధ్యతలు చేపట్టింది. బీఎన్పీ (BNP) అధినేత తారిక్ రెహమాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే సైన్యంలో కీలక నియామకాలు మరియు బదిలీలు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

లెఫ్టినెంట్ జనరల్ ఎం మైనూర్ రెహమాన్ బంగ్లాదేశ్ సైన్యానికి కొత్త ‘చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్’ (CGS)గా నియమితులయ్యారు,మేజర్ జనరల్ కైజర్ రషీద్ చౌధురిని అత్యంత కీలకమైన ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్’ (DGFI) అధిపతిగా నియమించారు, భారత్‌లోని బంగ్లాదేశ్ హైకమిషన్‌లో డిఫెన్స్ అడ్వైజర్‌గా పనిచేస్తున్న బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ హఫీజుర్ రెహమాన్కు మేజర్ జనరల్‌గా పదోన్నతి లభించింది. ఆయనను ఇప్పుడు 55వ ఇన్‌ఫ్రాంట్రీ డివిజన్‌ జీఓసీగా నియమించారు.

ఆగస్టు 2024లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీ మూడింట రెండొంతుల మెజార్టీతో విజయం సాధించడంతో దేశంలో మళ్ళీ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటయ్యింది.ఈ మార్పులు దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, వ్యూహాత్మక కమాండ్‌లలో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version