Latest Updates

ఫ్లెక్సీలు తొలగించినా ప్రజల గుండెల్లో KTR అనే స్థానం అజేయం: తలసాని

ఇథనాల్ మంటలు: కాంగ్రెస్ నేతలకు తలసాని సవాల్ | BRS Talasani Srinivas  Political Counter To Congress Leaders | Sakshi

బీఆర్‌ఎస్ వర్గాలు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కాంగ్రెస్ కార్యకర్తలు కక్షపూరితంగా తొలగించినా, అది పెద్ద విషయమేమీ కాదని, కేటీఆర్ ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడని సనత్‌నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట్‌ లోని సెయింట్ ఫెలోమినా స్కూల్‌ లో నిర్వహించిన “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమంలో మాజీ ఎంపీ జి. సంతోష్ కుమార్‌తో కలిసి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, కేటీఆర్‌ ప్రజల మనసుల్లో ముద్ర వేసుకున్న నాయకుడని, అతనిపై ప్రజల్లో విశ్వాసం ఉందని అన్నారు.

అలాగే, ప్రజలకు మేలు చేసే పథకాల్లో ఒకటైన కేసీఆర్ కిట్ పథకాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version