Business
ఫోన్పే, గూగుల్ పే వాడుతున్న వారికి కీలక నోటీసు – ఆగస్ట్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి
యుపీఐ (UPI) సేవలపై కీలక మార్పులు రాబోతున్నాయి. ఫోన్పే (PhonePe), గూగుల్ పే (Google Pay) వంటివి వాడే వినియోగదారులకు ఇది ఒక కీలక సూచనగా మారనుంది. రేపటి yani ఆగస్ట్ 1 నుంచి కొన్ని కొత్త నిబంధనలు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. యుపీఐ వినియోగాన్ని మరింత వ్యవస్థబద్ధంగా మార్చే ఉద్దేశంతో ఈ మార్పులు తీసుకువచ్చారు.
కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారులు రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునే వీలుంటుంది. ఇకపై ప్రతి ట్రాన్సాక్షన్ తర్వాత ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ డిస్ప్లే అవుతుంది. దీనితో పాటు, ఆటోపే లావాదేవీలు ఉదయం 10 గంటల ముందు లేదా రాత్రి 9:30 గంటల తర్వాత మాత్రమే జరుగుతాయి. అంటే మధ్యాహ్న సమయంలో ఆటోపే ద్వారా లావాదేవీలు జరగవు.
ఇంకా, పెండింగ్ ట్రాన్సాక్షన్ల స్టేటస్ చెక్ చేసేందుకు రోజుకు మూడుసార్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. మూడుసార్ల తరువాత మరోసారి చెక్ చేయాలంటే కనీసం 90 సెకన్ల విరామం తీసుకోవాలి. వినియోగదారుల గమనికకు – ఈ నిబంధనలు అన్ని యుపీఐ యాప్‌లకు వర్తిస్తాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పష్టం చేసింది. కాగా, వినియోగదారులు ట్రాన్సాక్షన్ల ప్రణాళికలో ఈ మార్పులను దృష్టిలో ఉంచుకోవడం మేలుగా సూచిస్తున్నారు.