Andhra Pradesh

ప్రభుత్వ స్కూళ్లపై సామాన్యుడి సూటి ప్రశ్నలు: టీచర్లకు చేదు అనుభవం

ముఖ్యమంత్రి విద్యార్థి ప్రతిభా యోజన: దరఖాస్తు, ప్రయోజనాలు, అర్హత & మరిన్ని

ఆదిలాబాద్ జిల్లా, యపల్గూడలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు బడిబాట కార్యక్రమం చేపట్టిన ఉపాధ్యాయులకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. స్థానికంగా ఓ సామాన్యుడు టీచర్లను సూటిగా ప్రశ్నల వర్షం కురిపించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

“మీ పిల్లలు ఎందుకు ప్రభుత్వ స్కూళ్లలో చదవడం లేదు? మీరే మీ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తారు, మరి సామాన్యుల పిల్లలు మాత్రం ఈ స్కూళ్లలో ఎందుకు చదవాలి?” అని ఆ వ్యక్తి టీచర్లను నిలదీశాడు. ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలంటే ఉపాధ్యాయుల సహకారం కీలకమని, కానీ వారు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని ఆరోపించాడు. “ప్రైవేట్ స్కూళ్లలో టెన్త్, ఇంటర్ ఫెయిల్ అయిన వారు పాఠాలు చెబుతున్నారు. మీరు బీఈడీ చదివి ఇక్కడేం చేస్తున్నారు?” అని సూటిగా కడిగిపడేశాడు.

ఈ ఘటనలో ఆ వ్యక్తి ప్రభుత్వ విద్యా వ్యవస్థలోని లోపాలను, ఉపాధ్యాయుల బాధ్యతలను ప్రశ్నించడం ద్వారా సమాజంలో చర్చకు తావిచ్చాడు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మెరుగుపరచాలంటే ఉపాధ్యాయులు, అధికారులు, సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ ఘటన స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version